Saturday, July 01, 2006


పాపం - ప్రాయశ్చిత్తం


"దాసుని తప్పు దండం(దణ్ణం) తో సరి"
"చేసిన తప్పు చెబితే పోతుంది"
"పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు"


వీటి గురించి మీ అభిప్రాయం ఏమిటి?

వెనకటికెవరో ఏదో బ్లాగులో(దొరక్కానే లింకిస్తాను) భక్తి గురించి వ్రాస్తూ కొన్ని ప్రశ్నలేసారు. అందులో ఒకటి అజామిళుడి గురించి. అవి చదివిన తర్వాతే ఈ ఆలోచననొచ్చింది.

నిజమే, మొదలు సద్బ్రాహ్మణుడైనా, తరువాత వేశ్యాలోలుడై భ్రష్టుడైనా, అవసానకాలంలో యమభటులను చూచి భీతితో తన కిష్టమైన చిన్న కొడుకుని "నారాయణా" అని పిలిచినందుకు విష్ణు దూతలు అతన్ని కాపాడారు. పశ్చాత్తాపుడైన అజామిళుడు దైవచింతనామగ్నుడై కొంతకాలం తరువాత విష్ణుసాయుజ్యం పొందాడు. ఇదీ కథ స్థూలంగా.

ఇదే విషయం గురించి మాట్లాడుతుంటే మావాడొకడు "హిందూ మతం పర్లేదు, అట్లీస్ట్ ఏం చేయాలో సొల్యూషన్ చెబుతుంది తుడిచెయ్యకుండా. అదే కిరస్తానీ మతమైతే (ఎవరినీ బాధపెట్టే ఉద్దేశ్యం లేదు) చేయాల్సిన తప్పులన్నీ (ఎంజాయ్)చేసి, ఆదివారం పొద్దుట చర్చ్‌కెళ్ళి ఫాదరీతో దేవుడా! తప్పులు చేశాను - క్షమించంటే చాలు, అన్ని పాపాలూ క్లాస్ వన్ ఫినాయిల్‌తో కడిగినట్లు కడిగేస్తాడట తెలుసా" అంటూ చిన్న సైజు లెక్చరిచ్చాడు. మరి ముసల్మానుల సంగతేంటో మరి (వాళ్ళు పరమ స్ట్రిక్టేమో - కన్నుకు కన్ను, కాలుకు కాలు!!)

మతాల ఉద్దేశ్యం తేలిగ్గా కడుక్కునే మార్గముంది కనుక యధేచ్ఛగా పాపాలు చేయమని, లేదా ఏ రకంగా చేసినా తప్పు తప్పే(పాపం) కనుక క్షమించకూడదని మాత్రం కాదనుకుంటా? ఎనీ సెకండ్ ఒపీనియన్?

అసలు పాపం అంటే ఏమిటి?
పాపం యొక్క తీవ్రత ఎలా తెలుస్తుంది?
అసలు మనం పాపం అంటున్న దాన్ని పాపం అని ఎవరు/ఎప్పుడు/ఎందుకు సెలవిచ్చారు?

For every action there is an equal & opposite reaction - Einstein
కాబట్టి, తప్పేంటో, దాని తీవ్రతేంటో తెలిస్తేనే కదా దానికి చెయ్యాల్సిన ప్రతిచర్య/ప్రతిక్రియ గురించి అలోచించడనికి.

ఇలా అలోచిస్తే, తప్పు/పాపం తెలియక చేసినవాడికి, తెలిసి చేసిన వాడికి తేడా ఏమిటి? అంటే సంఘటన కాంటెక్స్‌ట్ గురించి కూడా ఆలోచించాలా, వద్దా?

ఏమిటో అన్నీ ప్రశ్నలే? ఇంకొంచెం ప్రశాంతంగా, దీర్ఘంగా, తార్కికంగా ఆలోచించాలనుకుంటాను. ఎవరన్నా సాయం చేద్దురూ? Can anybody lend a hand?

5 comments:

spandana said...

"దాసుని తప్పు దండం(దణ్ణం) తో సరి"
-- బహుశా దీని అంతఃరార్తం దాసున్ని దయతో వదిలివేయమని చెప్పడమయి ఉంటుంది. అప్పటి కాలాన్ని బట్టి, దాసుడు యజమాని దయాదాక్షిన్యాలమీద ఆదారపడినవాడు గనుక తను చేసే తప్పుల్ని దండంతో(దండం అంటే ఆ తప్పు మళ్ళీ చేయనని క్షమించమనీ వేడుకోవడం) సరిపెట్టీ క్షమించి వదిలివేయమని అర్థం.
"చేసిన తప్పు చెబితే పోతుంది"
-- దీని అర్థం కూడా అలాంటిదే, చెప్పడం అంటే తప్పుతెలుసుకొని పశ్చత్తాపపడి చెప్పడం.
"పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు"
-- ఇది కూడా పై న్యాయాన్నే సమర్థిస్తుంది. తప్పు తెలుసుకొని నిజమైన పశ్చాత్తాపం చెందుతున్న వాడు అతి పెద్ద శిక్ష అనుభవిస్తున్నట్లే. తప్పు చేశాననే భావం వాన్ని కాల్చుకుతింటుంది. అందువల్ల పశ్చాత్తాపానికి మించిన శిచ్చ లేదు.


పైన చెప్పిన నానుడుల్లో నాకు పెద్ద తప్పు కనిపించడం లేదు కానీ, ఆచరణలో మనం వాటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం.

క్రైస్తవ మత ముఖ్యోద్దేశ్యమదే. చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపము చెంది, ప్రభువు యెదుట ప్రార్తించడం వల్ల తను క్షమిస్తాడని అర్థం. కానీ జరుగుతున్నది వేరు. ఏ తప్పు చేసినా ప్రభువు గుడ్డిగా క్షమిస్తాడు అంటే అది మూర్ఖత్వమే!

నేనైతే హిందు మత పక్షపాతినే. ఈ కులాల చీడ, అంటరానితనమనే వ్యాధి లేకుంటే ఇది ఇప్పటి మతాల ఘర్షణలకు సరైన చికిత్స.
ప్రతిమతం ఉద్దేశ్యం మంచిదే కానీ మార్గాలే కొంచం అటు, ఇటూగా ఉన్నాయి. నా మార్గమే (మతమే) గొప్పదనే మూర్ఖంపు పత్తుదల, పోరాటాలే అనర్థానికి మూలమవుతున్నాయి.
హిందూమతపు గొప్పదనమంతా ఏ తత్వాన్నైనా, ఏ మతాచారాన్నైనా తనలో ఇముడ్చుకునే గుణంలోనే ఉంది. ఏ మార్గమైనా చివరికి నన్నే చేరుతుంది అంటాడు కృష్నుడు. అలాగే మనుషుల్లో పాపం పెరిగినప్పుడు ఆయా కాలాల్లో, ఆయాచోట్ల దుష్టులని శిక్షించడానికి తను జన్మిస్తానంటాడు. దీని వల్ల క్రీస్తునైనా, ప్రవక్తనైనా, బుద్దున్నైనా ఆ భగవంతుడిరూపంగా, అంశగా భావించడానికీ, గౌరవించడానికీ హిందూమతం అవకాశమిస్తుంది.
హిందుమతంలో దేవుల్లెందరో అని చాలామంది అపోహ, అవహేళణ.
ఇతర మతాలు చెప్పే ఒకే దేవుడు కంటే కూడా, అద్వైతం చెప్పే దేవుడొక్కడె ఎంతొ విశాలమైంది. అన్నీ తనలో, అన్నిటిలో తాను .... ఇంతకంటే ఏకత్వము ఎక్కడుంది?
మొన్నామద్య తేజ చానల్‌లో క్రైస్తవ ప్రభోదము వింటున్నాను. "నీ పొరుగువాన్ని ప్రేమించు" అనే వాక్యము గురించి చెప్తున్నాడు. ఇలాంటివే సూక్తులు అన్ని మతాల్లోనూ ఉంటాయి..కానీ వాటిని వదిలేసి మా మతం గొప్పది అని ప్రచారం చేసుకొని.. "ప్రభువు ద్వారానే దేవుడు దగ్గరికి చేరగలవు" అని మూర్ఖంగా వాదించడమే అనర్తాలకు హేతువు.

క్షమించండి, అసలు విషయం నుండీ చాలా పక్కకు వెళ్ళినట్లున్నాను.

దర్మం ఏది అంటే.. నీకేది నొప్పి కలిగిస్తుందో దాన్ని ఇతరులకు చేయక పోవటం... మహాభారతంలో ఉన్న ఈ ధర్మాన్ని పాటించకపోవటమే పాపం. తెలిసి తప్పు చేసి, నారాయణా అన్నా, అల్లా అన్నా, జీసస్ అన్నా పాపవిముక్తి కలగదు. ఇది నా మతం. ఈ పూజలూ, అభిషేకాలు, పారాయణాలు మనిషిలోని దేవున్ని గుర్తించనంతవరకు ఒట్టి పిచ్చివాడి కలాపాలు.
-- ప్రసాద్

Anonymous said...

దాసుని తప్పు దండంతో సరి అంటే నమస్కారంతో కాదనుకుంటాను. దండం అంటే ఇక్కడ కర్ర అని అర్థం. దాసుడు తప్పు చేసినప్పుడు యజమాని అతణ్ణి కర్రతో కొట్టి శిక్షించాలని ఇక్కడ ఉద్దేశం. పశ్చాత్తాపాలు, ప్రాయశ్చిత్తాలు ఇక్కడ పని చెయ్యవు. అలా కానప్పుడు అందరి తప్పులనూ నమస్కారంతోనే సరిపెట్టేయవచ్చు కదా? దాసుని తప్పులు అని ప్

త్రివిక్రమ్ Trivikram said...

దాసుని తప్పు దండంతో సరి అంటే నమస్కారంతో కాదనుకుంటాను. దండం అంటే ఇక్కడ కర్ర అని అర్థం. దాసుడు తప్పు చేసినప్పుడు యజమాని అతణ్ణి కర్రతో కొట్టి శిక్షించాలని ఇక్కడ ఉద్దేశం. పశ్చాత్తాపాలు, ప్రాయశ్చిత్తాలు ఇక్కడ పని చెయ్యవు. అలా కానప్పుడు అందరి తప్పులనూ నమస్కారంతోనే సరిపెట్టేయవచ్చు కదా? దాసుని తప్పులు అని ప్రత్యేకించి చెప్పడం ఎందుకు?
బ్లాగు నాదే. అజామిళుడి కథ సగం వరకే చదివి ఆవేశ పడ్డానన్నమాట! ఆ కథ చదివేటప్పుడు నాకు అంతగా చిర్రెత్తుకొచ్చింది. నారాయణా అనే ఒకే ఒక్క మాటను పట్టుకుని విష్ణు భటులు పూర్వాపరాలు తెలుసుకోకుండా పరిగెత్తుకొచ్చేస్తారా? పైగా తమ విధిని నిర్వహిస్తున్న యమ భటుల్ని కొట్టి తరిమేస్తారా? మరి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అన్ని సంవత్సరాల తరబడి మొత్తుకున్నా అతడి మొర వాళ్ళ చెవిన బడనే లేదా? దీన్నెలా అర్థం చేసుకోవడం?
స్పందన మీకిక్కడ సందేహాలు తీర్చారు గానీ తన బ్లాగులో బోలెడన్ని ప్రశ్నలు. సంధించారు :D

Naga said...

తెలుగులో అనువాదం చేయవలసిన వ్యాసం ఇది. ప్రస్తుతం ఇంగ్లీషులో మాత్రమే ఉంది. జ్ఞానియొక్క న్యాయ పద్ధతి (ఎన్లైటెన్డ్ జస్టిస్ ప్రొసిజర్) అనే ఈ ఉత్తమ వ్యాసాన్ని చదవండి.

చక్రవర్తి said...

Here are my 2 cents on "Tappu or Ooppu". These 2 words are mearly similar to the orther dual words of the human life.

You might wonder what are the other dual words.. they are like, good and bad, day and light, black and white, right and wrong, kind such words.

These words are very hard to define as well very difficult to express in simple words. But out of my understanding of people from different walks of like, all i understand is..

"Good and Bad, Right or Wrong (for that matter any such opposite words) are just nothing but LIKE and DISLIKEs of every individuals"

If you like that, it is good for you, similarly, if you don't like that is bad for you. There is a thin line difference between these dual words.

Rather going for a common definitions, it is better if every individual think of such words and act accordingly.

Correct me if hurt any one's feelings.