Saturday, August 11, 2007


స్తబ్ధత


{స్వగతం}
ఇన్ని రోజులు స్తబ్ధుగా వుండటానికి కారణాలు చాలా వున్నాయి - కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్లుగా.

ఊరు మారటం - బెంగళూరు నుండి హైదరాబాదుకు [1]
నా మొదటి వుద్యోగం బెంగుళూరు లోనే. తర్వాత హైదరాబాదు షిఫ్టయ్యా. కొత్త వుద్యోగం బెంగళూరులో రావటంతో మళ్ళీ బెంగళూరు, ఆపై కొత్త బ్రాంచీ కోసం తిరిగి హైదరాబాదు. ఏక్‌నిరంజన్ గాళ్ళయితే ప్రాబ్లెం లేదుకానీ, పెళ్ళాం పిల్లలతో ఊరు మారడం అంత సులభమేం కాదు సుమీ!

కొత్త ఆఫీసు, కొత్త ప్లేసు, కొత్త జనం [2]
కొంత సమయం పడుతుంది అడ్జస్టయ్యేందుకు - మిగిలిన వాళ్ళని అడ్జస్ట్ చేసేందుకు. కొత్త ఆఫీసవడం వల్ల ఏ పని కావాలన్నా ఒకటికి నాల్గింతలు టైం తీసుకుంటోంది. దానికి తోడు కొత్త జనం - పనికి కొత్త, ఇక చెప్పేదేముంది!

కొత్త ప్రాజెక్టు - వర్కు లోడు పెరగటం [3]
పాతాఫీసునుండి మోసుకొచ్చిన పాత ప్రాజెక్టుతో పాటు, కొత్తాఫీసుకు రాగానే కొత్త ప్రాజెక్టూ వచ్చి పడింది. కొత్తగా చేరినవారికింకా పని అలవాటు కాకపోవడం - నా నెత్తి పెద్ద బండయ్యింది.

ఇంట్లో బాదర బందీలు [4]
గ్యాస్ కనెక్షనూ, చుట్టుపక్కల కూరగాయలూ-సూపర్‌మార్కెట్టులూ (ఇంటావిడకి నచ్చేట్టుగా) వెతకడం, బట్టలారేసుకోవడానికి దండెం కట్టడం, గోడకు మేకులు కొట్టడం, మొదలైనవి.

పాత పరిచయాలు - చుట్టరికాలూ [5]
హైదరాబాదుకు పాతకాపునే కనుక పాత పరిచయాల్ని తిరగేయటం, చుట్టుపక్కాల్ని పలకరిచడం - సాయంకాలమైతే ఇదే పని.

ఆరోగ్య సమస్యలు [6]
నాకు ఫుడ్ పాయిజనింగ్, నాన్నకు లో-షుగరూ, మేనమామ భార్యకు కేన్సరూ, ఇంకో మేనమామ వియ్యంకురాలికి మైల్డు స్ట్రోకూ, ఏంచెప్పమంటారు లెండి.

ఇల్లు - నో ఇంటర్నెట్టూ [7]
కొత్తగా రావటం వల్ల ఇంట్లో ఇంకా ఇంటర్నెట్టు లేదు. అందులోను కొత్త అపార్టుమెంటవ్వడంతో పక్క ఫ్లాట్ల వాళ్ళెవరికి కూడా ఇంటర్నెట్టు లేదు. బియస్సెన్నెల్ కు ఫోను కోసం అప్లై చెయ్యాలి :-(
...
...
...
...
...
...

కానీ చివరిగా ... బద్దకమెక్కువైంది. హహ్హహ్హ!!!

4 comments:

రాధిక said...

"కానీ చివరిగా ... బద్దకమెక్కువైంది. హహ్హహ్హ!!!"nijaalu oppeasukoakuuDadu.

oremuna said...

అయితే ఈ ఆదివారం మీటింగుకు వస్తున్నారన్నమాట

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

సంసారం లో ఈతి బాధలు తప్పవండీ మురళీ గారూ..!!

మురళీ కృష్ణ said...

:oremuna
చావా గారూ, లేదండీ. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టు పనిమీద బుడాపెస్ట్ లో వున్నాను. ఇంకో రెండు నెల్ల దాకా కుదర్దు.

అందుకే, ఇక్కడున్నన్ని రోజులూ వారానికో రెండు టపాలు రాద్దామని డిసైడ్ అయ్యా