Friday, August 11, 2006


ఇది పరాకాష్ట ... కొనసాగింపు


"నిన్న జెమిని టివీలో “బంగారం మీకోసం” చూస్తున్నాను. అందులో ఒక ప్రశ్న “Sun flower” పువ్వుని తెలుగులో ఏమంటారు అని! మన జీవిత కాలంలోనే ఇలాంటి క్విజ్ ప్రశ్నలు ఇంకా వినాల్సి వస్తుంది కాబోలు!" అంటూ చరసాల గారి బ్లాగు లోని ఇది పరాకాష్టలో చూసి, క్రింద సుధాకర్, త్రివిక్రమ్ గార్ల కామెంట్లు చదివిన తర్వాత ...

ఆగండి సారూ! అంత కష్టమైన (నిజమా?) ప్రశ్నలు వేస్తున్న ఝాన్సీనో, ఉదయభానునో లేక రమ్యకృష్ణనో చూసి కాదు తల జుట్టు పీక్కోవాల్సింది - వాటిక్కూడా సమాధానాలు చెప్పలేక బహుమతి కోసం క్లూ (clue)ల కోసం బతిమాలాడే పెద్దవాళ్ళని చూసి.

టీవీ వాళ్లనేంచెయ్యమంటారు? సమాధానం చెబితేనే బహుమతివ్వాలి. బహుమతులివ్వకపోతే జనాల్లో కార్యక్రమం పాపులరవ్వదు. కాబట్టే అంతలేసి ఖస్టమైన ప్రశ్నలడుగుతున్నారు మరి. గట్టిగా మాట్లాడితే ద్రౌపది భర్తలైదుగురి పేర్లూ (ఇంతకీ ఐదని కూడా తెలుసా లేదో) చెప్పలేని వాళ్ళని చూసి పీక్కోవాలండీ తలో, జుట్టో, మరోటో!

6 comments:

Sudhakar said...

ఇది కూడా నిజమేనండి. మన దౌర్భాగ్యం..ఏం చేస్తాం :-( ఇదే కార్యక్రమంలో ఒకామెను గాలికి మరొక పేరు అడిగి, అది "వా" తో మొదలవుతుంది అని చెప్పిన కూడా ఆమే ఎదైనా క్లూ ఇవ్వండి అని పిచ్చి నవ్వు నవ్వటం చూసా :-)

Sudhakar said...

na blog url is sodhana.blogspot.com andi.

మురళీ కృష్ణ said...

క్షమించండి సుధాకర్ గారూ, మీ పాత URL పబ్లిష్ చేసినట్లున్నాను. ఇప్పుడు కరక్ట్ చేశాను.

త్రివిక్రమ్ Trivikram said...

"సమాధానం చెబితేనే బహుమతివ్వాలి." నిజమే. కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళను పిలిచిి ఇలాంటి ప్రశ్నలడగడం నాకు నచ్చలేదు. జనాదరణను పెంచుకోవడానికి ప్రేక్షకులకు బహుమతులివ్వడం (దానికోసం ఇలాంటి పిచ్చి ప్రశ్నలడగడం) తప్ప ఇంకో విధంగా ఆలోచించలేనివాళ్ళు 24-గంటల కాలక్షేపం కాలవలు నడపడం మన ప్రారబ్ధం కాదంటారా?

కొత్త పాళీ said...

వెనకటి కెవడో పంచపాండవు లెందరంటే మంచం కోళ్ళలాగా ముగ్గురని రెండు వేళ్ళు చూపించాట్ట. మన టీవీ వాళ్ళని చూసే ఆ సామెత పుట్టి వుంటుంది.

Anonymous said...

Thanks to author.