Thursday, August 10, 2006


నల్లికి నరుడే మందు !


డబ్బుల కోసం రక్తదానం చేసేవారిని మించిపోయి ... రెండు రూపాయిల కోసం ఆ రక్తాన్ని నల్లులకు స్వచ్ఛందంగా సమర్పించుకుంటున్నారు పశ్చిమ బెంగాల్లోని పేదలు. ఇక్కడ నగరాల శివార్లలోను, పట్నాల్లోనూ దాబాల సంఖ్య తక్కవేమీ కాదు. చాలా దాబాల్లో కుర్చీలు, టేబుళ్ళకు బదులు నులకమంచాలే వాడుతుంటారు. ఈ మంచాలకు కొబ్బరి లేదా జనపనారతో పేనిన తాళ్ళను పట్టీలుగా వాడడంతో నల్లుల సమస్య చాలా ఎక్కువ.

వేడినీళ్ళు పోయడం, క్రిమిసంహారక మందులు వాడడం వాటిని నివారించవచ్చు కానీ దాబాల యజమానులు అవి చాలా ఖరీదైన చర్యలుగా భావిస్తున్నారు. అందుకు వారో చవకరకం ఉపాయాన్ని కనుక్కున్నారు. గ్రామాల్నుంచి వచ్చే పేదల్నే పురుగుమందులుగా మారుస్తున్నారు.

సాయంకాలం దాబా తెరుస్తూనే ఓ వ్యక్తి 90 (౯౦) శాతం నగ్నంగా నల్లులు రక్తం పీల్చుకుని సంతృప్తి పడేదాకా పడుకుంటాడు. తరువాత ఆ నల్లులు తృప్తి చెంది మంచం కోళ్ళలోని ఇరుకు సందుల్లోకి జారుకుంటాయి. తర్వాత ఎవరు కూర్చున్నా మర్నాటి దాకా కుట్టవు. ఇలా మంచం మీది నల్లుల్ని తృప్తిపరచినందుకు అతడికి దక్కేది రెండ్రూపాయలే.

దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లాలోని దాబా యజమాని దల్బీర్ ఖేత్రి మాట్లాడుతూ "మంచాల్ని పూర్తిగా వేణ్ణీట్లో ముంచితే నల్లల్ని నివారించవచ్చు. కానీ అని ఆరడానికి ఒక రోజంతా పడుతుంది. అందుకని అలా చేయలేక పోతున్నాం. పురుగుమందులు వాడదామంటే ఖరీదు చాలా ఎక్కువ. మా కస్టమర్లంతా ట్రక్కు డ్రైవర్లూ, క్లీనర్లే. అంత భరించలేక ఈ మార్గాన్ని ఎంచుకున్నాం." అని వివరించారు. "ఏదో ఒక ఉపాది దొరికింది - అంతే చాలు" అని జాబువా జిల్లాలో నల్లులకు తన రక్తాన్ని ఆహారంగా పెడుతున్న ఓ వ్యక్తి పేర్కొన్నాడు.
-- ఈనాడు వార్త

2 comments:

త్రివిక్రమ్ Trivikram said...

అలంగ్ (గుజరాత్) లో ఉండే ఓడల్ని పగలగొట్టే పరిశ్రమలోని కార్మికులు క్లెమెన్స్యూ ఓడ రావాలనే కోరుకున్నారు. ఎందుకంటే ఎంత విషపూరితమైనా వారికి అది తిండి పెడుతుంది కాబట్టి. ఇలాంటి వాళ్ళ పరిస్థితుల గురించి ఎవరూ - ఆఖరుకు కార్మిక నాయకులు, పర్యావరణ పరిరక్షకులతో సహా - పట్టించుకోరు.

Anonymous said...

Wonderful blog.