Thursday, May 22, 2008


ఐతే ఏంటి?


(పేపర్లో వార్త - కర్ణాటకలో కల్తీ సారా మృతులు 190)
(స్ధలం - ఆఫీసులో మధ్యాహ్నం తిన్నాక)


కల్తీ సారా తాగి చనిపోయినవారి సంఖ్య 150 దాటింది.
ఎవరా నూటేభై?
కూలీ నాలీ చేసుకునే లేబర్ క్లాస్.
ఓ... లేబర్ క్లాసా!
లేబర్ క్లాసైతే మాత్రం వాళ్లు మాత్రం మనుషులు కారా?
మనుషులే, వాళ్లలోను రక్తం వుంటుంది (నవ్వు). కానీ వాళ్ళవల్ల దేశానికేం ఉపయోగం, భారం తప్ప.
భారమా!!?
కాక, మనది బీదదేశం ఎందుకైంది - ఇలా లేబర్ క్లాసు వాళ్ళెక్కువయ్యే కదా.
ఆహా!!!
అంతేకాదు, ఎప్పుడైనా హాలీవుడ్ సినిమాల్లో ఇండియాను చూశావా. అడుక్కుతినేవాళ్లు, చేపలు పట్టేవాళ్లు, పాములాడించే వాళ్ళు వుండేదే భారద్దేశం అని చూపిస్తారు. ఎంత బాధేస్తుందో.
అయితే మాత్రం బీదోళ్లు చస్తే నీకు ఓకేనా. చూస్తుంటే బీదోళ్ళందర్నీ చంపేయాలనేట్లున్నావే.
అవున్రోయ్. ఆ పనిచేస్తే ఇండియా అమెరికా కన్నా రిచ్ కంట్రీ అయిపోతుంది.
కానీ కొన్ని విషయాలు మర్చిపోతున్నావు.
ఏమిటవి?
నీ బట్టలెవరూ వుతకరు, ఇస్త్రీచెయ్యరు. అంట్లు తోమరు, ఇల్లు తుడవరు. అన్నీచచ్చినట్లు నువ్వే చేసుకోవాలి.
...
పొలాల్లో పనిచేయాలన్నా, బిల్డింగులు కట్టాలన్నా వాళ్లే గతి.
...
అంతెందుకు, స్టేషన్లో దిగింతర్వాత నీ సామాన్లు మోసుకురావాలన్నా వాళ్లేగతి.
...
చివరకి కంపుకొట్టే చెత్త క్లీన్ చెయ్యాలన్నా వాళ్ళే కావాలి.
...
ఇప్పుడు చెప్పు వాళ్లే లేకపోతే నీ రిచ్ భారద్దేశం గతేంటో. కంపుగొట్టుది (హ్హ హ్హ)
...
...
...
హా... ఐడియా.

ఏంటది?
వుతకడానికి వాషింగ్ మెషీనూ, అంట్లకు డిష్ వాషరూ, క్లీనింగ్‌కు వాక్యూమ్ క్లీనరూ
మ...
ఆగాగు, ఇస్త్రీకు కూడా ఇలానే ఏదో వుండే వుంటుంది. లేకపోతే కనుక్కుంటాం.
...
క్రాప్ మెషీన్లూ, గ్రీప్ మెషీన్లూ అంటూ ఎలాను వున్నాయి.
ఓర్నీ..!!
ఆ మరి, బిల్డింగులకూ ఇలాగే మెషీన్లు వాడతా. మరీ అవసరమైతే రోబోట్లు తయారు చేసి వాడుకుంటాం మిగతా వాటికి.
...
మరిప్పుడేమంటావ్?
అంతేనంటావా! నిజానికి ఈ లేబరోళ్లతో పెద్ద తంటారా బాబు. ఓ రోజొస్తే ఓ రోజు రారు. బతిమాలితే నెత్తికెక్కుతారు. నుంచో బెట్టి దోచేస్తారు. నువ్వన్నట్లయితే ఈ గొడవలేమీ వుండవనుకుంటా!
(కాలరెగరేసాడు)
(ప్రక్క సీటతను తలతిప్పి)

రాజకీయనాయకులకు మరి ఓట్లెవరేస్తారు?
...
అదీ గుడ్డిగా!! (చిరునవ్వు)

(డూ యూ హేవ్ ఎనీ ఐడియా?)

2 comments:

కొత్త పాళీ said...

సెబాసు.
చమత్కారానికి రాసినా, సెటైరుకి రాసినా, చెప్పాల్సిన మాట చెప్పారు.
ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి సరిగ్గా ఇదే.
ఇన్నాళ్ళూ కుప్పలు తెప్పలు జీతాలిచ్చిన యంత్రోత్పత్తి పనులు అన్నీ విదేశాలకి చెక్కేశాయి, కంపెనీల ఖర్చు తగ్గించడానికి.
పొలాల్లోనూ, హోటళ్ళలోనూ, మాంసం పొట్లాలు కట్టే కంపెనీల్లోనూ బోలెడు ఉద్యోగాలున్నై కానీ అతి తక్కువ జీతం, అతి ఎక్కువ శ్రమ. వీటిల్లో ఎక్కువగా పనిచేసేది సరైన అనుమతిలేకుండా దేశంలోకి వచ్చిన విదేశీయులు (మెక్సికన్లు, ఇతర హిస్పానిక్ దేశాల వారు, ఇలా). అమెరికన్లెవరికీ చూస్తూ చూస్తూ ఇలాంటి హీనమైన వృత్తులు చేపట్టడం ఇష్టం లేదు. పోనీ ఎవళ్ళో వచ్చి చేసేస్తున్నారని వాళ్ళ మీద పడి ఏడుస్తారు. వీళ్ళకి తగిన జీతం ఇచ్చి ఈ పనులు చేయించాలంటే రేపటినించీ ఒక ఏపిల్ పండు రెండు డాలర్లవుతుంది, ఒక కోడి పేకెట్టు $30 అవుతుంది, హోటలు గదిలో ఉతికిన దుప్పట్లు కావాలంటే $50 అదనం అంటారు .. అలా జరిగితే మళ్ళీ అది ఇంకో ఏడుపు!

Anonymous said...

murlikrishnajee..mee kadha,allika chala sahjamgaa vunnay..panimanushulani chinnachoopu choose vaare kaani mana kosam panichese mana manushuluga vaarini gurthimche rojulu raavali.kevalam dabbu vumte annipanulu jarigipotaayanukumte amthaku minchina verri maredee leneledu.allamti variki meekadha churakapettimdamdoy.subhakamkshalu.
.............kala