Thursday, April 17, 2008


ఏన్యువల్ డే - ౧


ఓ ప్రముఖ కంపెనీ (పేరు గోప్యంగా వుంచడమైనది) ఆన్యువల్ డే (ఆంగ్లంలో ఏమంటారో?) సందర్భంగా పాలెస్ గ్రౌండ్సులో భారీ ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మా బామ్మర్ది అందులో పనిచేస్తుడడంతో నాకూ ఎక్స్టెండయ్యింది ఆహ్వానం. ఎప్పుడూ చూడలేదు కదా అని అంతా బయలుదేరాం.

ఏర్పాట్లు మాత్రం నిజంగానే బ్రహ్మాండం. ఏంకర్లుగా ఓ ఇద్దర్ని బయటనుంచి పిలిపించారట - ఏమీ లాభంలేదు. కుళ్ళు జోకులేస్తూ (ఇంగ్లీషు మరియు కన్నడంలో) నవ్వించడానికి ప్రయత్నిచారు - కానీ పెద్దగా ఫలితం లేదు - జనాల్లో స్పందన లేదు. నాలుగు డేన్సులూ, రెండు పాటలూ - బయటివారి ఆర్కెస్ట్రా. లైటింగెఫక్ట్స్ లో పస లేదు, కానీ లేజర్ షో మాత్రం బాగుంది కానీ చూపించిన కాన్సెప్టు పెద్దగా బాలేదు. మధ్య మధ్యలో అవుట్ స్టాండింగ్ (?) ఉద్యోగస్తులకు అవార్డులూ, రివార్డులూనూ. ఇందులోనూ ఓ మచ్చేమిటంటే మావాడికో అవార్డు రావలసి వుండగా, చదివే ఏంకరమ్మ వేరేవాడి పేరు చదివితే, వాడానందంగా పుచ్చుకున్నాడు. రెండ్రోజుల తర్వాత మా వాడికి సారీ చెప్పారనుకోండి. చివరికి ఫుడ్డు తాజ్ వాళ్ళకి ఆర్డరిచ్చినా (పెద్దగా పేరు రాయించారు) బాలేదు. అసలు తాజ్ వాళ్ళు ఇంత దరిద్రంగా చేస్తారా అనిపించింది.

కష్టపడి మారతహళ్ళి నుండి పేలెస్ గ్రౌండ్సు కెళితే ఇంత చప్పగా వుందేంటా ప్రోగ్రాం అనుకుంటుంటే మరచి పోలేని సంఘటనొకటి జరిగింది.

సంఘటన వట్టి మాటలతో కాకుండా - బొమ్మలతో చూపిస్తా వచ్చే టపాలో.

3 comments:

రాధిక said...

ఆన్యువల్ డే ని తెలుగులో వార్షికోత్సవం అంటారండి.

చిన్నమయ్య said...

"ఓ ప్రముఖ కంపెనీ (పేరు గోప్యంగా వుంచడమైనది) ఆన్యువల్ డే (ఆంగ్లంలో ఏమంటారో?)"

"ఆన్యువల్ డే" అనే ఆంగ్లంలో అంటారు.

మురళీ కృష్ణ said...

@రాధిక: ధన్యవాదాలు - పెద్దవిషయాలు తవ్వే కొద్దీ చిన్న విషయాలు మర్చిపోతూంటా
@చిన్నమయ్య: హ్హహ్హ - తెలుగులో అనబోయి ఆంగ్లంలో అన్నా.