Tuesday, December 09, 2008


కాకలు తీరిన వీరులు - 2(అ)


ఎప్పుడో మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నప్పుడు మేమందరం సరదాగా చెప్పుకునే జోకొకటి.

మేనేజ్‌మెంట్ రంగంలో అనేక పరిశోధనలు, ప్రయోగాలు చేసి - అభివృద్ది ఎలా చెయ్యాలో, చెందుతుందో తెలుకున్నామంటున్న (కాకలు తీరిన వీరులు గా చెప్పుకొంటున్న) అప్రాచ్యులకీ (ప్రస్తుత సందర్భంలో అమెరికన్లకీ), నిశ్శబ్ధవిప్లవం ద్వారా అభివృద్ధిని సాధిస్తూన్న ప్రాచ్యులకీ (ప్రస్తుత సందర్భంలో జపానీయులకీ) ఓ సారి పోటీ వచ్చింది.

మాకు ఏ రంగంలో నైనా ఎదురు లేదు. మీ రేదంటే అదే ... సై అంటే సై. మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, ఐటీ,... వీటన్నిటిలో ఆల్రెడీ ముందున్నాం. కాబట్టి వేరే ఏదైనా - మీకు బాగా తెలిసిన దాన్నే ఎన్నుకోండి. నెలరోజుల్లోనే దాన్ని మీకన్నా బాగా తెలుసుకుని గెలుస్తాం [అ]

అలాగే. మా చుట్టుంతా నీళ్ళే కనక, పడవ పందేలు పెట్టుకుందాం (రోయింగ్) [జ]

అంతేనా. దీనికి నెలరోజుకు కూడా ఎక్కువే [అ]

-- సరే అంటే సరే అనుకున్నారు.

అమెరికన్లు - వెంటనే ఒక కమిటీ ఫార్మ్ చేశారు. ఓ తల పండిన మేనేజ్‌మెంట్ గురూని దానికి ఛైర్మన్ గా చేశారు. యధావిధిగా అతనికో పియ్యే. పడవ తెడ్డేసే వాళ్ళని ఎన్నుకునేందుకు ఓ రిక్రూట్‌మెంట్ స్పెషలిస్టు, తరువాత వాళ్ళకో కోచ్, ఫిట్‌నెస్ ట్రైనర్ నూ ఎన్నుకొని వాళ్ళకు పనప్పగించారు. రిక్రూటర్ మంచి శరీర ధారుడ్యంతో, బలంగా వున్న 21 మందితో పాటూ స్టాండ్ బై గా వుండేందుకు ఇంకో 5 గురినెక్కువ ఎన్నుకొన్నాడు. అందరికీ చాలా రిగరస్ గా ట్రైనింగిచ్చారు.

జపనీయులు - ఏ హడావుడీ లేకుండా వాళ్ళ రోజువారీ పనిని చేసుకుంటున్నారు.

పోటీకి గడువు సమీపించింది. ఇటు 21 మంది, అటు 21 మంది. పడవలు నీళ్ళలోకి దిగాయి. నీళ్ళలోని పడవల్లోకి మనుషులెక్కారు. పందెం ప్రారంభానికి సూచనగా గంట మ్రోగింది.

ఇరు పక్షాల వాళ్లూ చకచకా తెడ్లు వేస్తున్నారు. నీళ్ళమీద నుండి చల్లటి గాలేస్తున్నా చెమట్లు కారుతున్నాయి. చాలా ఉత్కంఠంగా సాగిన ఆ పోటీలో చివరికి ప్రాచ్యులే గెలిచారు.

(ఎందుకో - తర్వాతేమిటో - తరువాతి టపాలో)

5 comments:

Daamu said...

అమెరికన్లు - వెంటనే ఒక కమిటీ ఫార్మ్ చేశారు. ఓ తల పండిన మేనేజ్‌మెంట్ గురూని దానికి ఛైర్మన్ గా చేశారు. యధావిధిగా అతనికో పియ్యే. పడవ తెడ్డేసే వాళ్ళని ఎన్నుకునేందుకు ఓ రిక్రూట్‌మెంట్ స్పెషలిస్టు, తరువాత వాళ్ళకో కోచ్, ఫిట్‌నెస్ ట్రైనర్ నూ ఎన్నుకొని వాళ్ళకు పనప్పగించారు.

Inka,. team lo pani chesedhi Evadu ??

Anonymous said...

అమెరికా వాళ్ళ అంతరిక్ష కలమూ, రష్యా వాళ్ళ పెన్సిలు కథ లాంటిది కాదుగదా ఇది! :)

Shiva Bandaru said...

అమెరికా వల్ల పడవకి డైరక్షన్‌ ఇచ్చేవారెక్కువ , తెడ్డేసేవారు తక్కువ .

జపాన్‌ వాల్ల పడవకి తెడ్డేసేవరెక్కువ అందువల్ల జపాన్‌ వాళ్లు నెగ్గారు

Dileep.M said...

అమెరికా వాళ్ళ అంతరిక్ష కలమూ, రష్యా వాళ్ళ పెన్సిలు కథ లాంటిది కాదుగదా ఇది!... ఏమిటి???

Dr.Pen said...

అమెరికా వాళ్ళ అంతరిక్ష కలమూ
-రష్యా వాళ్ళ పెన్సిలు కథ :
http://www.snopes.com/business/genius/spacepen.asp
:-)