ఈ రోజు మధ్యాహ్నం భోంచేస్తూ అదీ ఇదీ మాట్లాడుతూంటే టాపిక్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కేసి మళ్ళింది
...
ఈ ఫైనాన్స్ సెక్టార్లో ఎంతోమంది కాకలు తీరిన వీరులున్నారుగదా... [ఒకడు]
... ఎవరాళ్ళు? [ఇంకోడు]
అంటే - ఏ పెద్ద కంపెనీనన్నా తీసుకో, దాన్ని నడిపే సన్నాసి ఐఐయ్యమ్మో, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండో వస్తాడు కదా! [ఒకడు]
... ఓ ఆ తెలివైన వాళ్ళ గురించా నీవు మాట్లాడేది. అర్థమైంది కాకలు తీరిన వీరులంటే. ఇహ చెప్పు. [ఇంకోడు]
ఇంత మంది కాకలు తీరిన వీరులు, టాప్ మోస్ట్ టాలెంటెడ్ ఎకనమిస్టులు, ఇంకా, ఇంకా ... వీళ్ళందరూ వుండికూడా బాంకు లెందు కిట్టా తగలడ్డాయి, షేర్ మార్కెట్టెందుకింత అతలా కుతల మౌతోంది? [ఒకడు]
... పడిపోతుంటే ఎట్టావుంటోందో చూట్టానికేమో (నవ్వుతూ) [ఇంకోడు]
వాళ్ళకేం మూటలు మూటలు ఆల్రెడీ దాచుకున్నారు - మామూలోళ్ళకే ఈ బాధంతా. [ఒకడు]
భలే ప్రశ్నేసావయ్యా - నిన్నో మెన్నో గుర్తులేదు. సియెన్నెన్నోడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తినిదే ప్రశ్నడిగాడు. [మరొకడు]
ఏమన్నాడయ్యా నారాయణమూర్తి? [ఒకడు]
Greed takes over Ethics & Values [మరొకడు]
భలేక్కొట్టాడు దెబ్బ [ఇంకోడు]
నిజమేరా - ఈ రోజుల్లో ఎవడు తిన్నగా పనిచేస్తున్నాడు. ఎక్కడ చూసినా మెయ్యటాలూ, మేపటాలూనూ. [ఒకడు]
ఎంత చదువు చదివినా పొట్టకూటికే ... [మరొకడు]
...కాదు కాదు, పక్కోళ్ళ పొట్ట కొట్టడానికే - లేక పోతే లక్షల్లక్షలు తీసుకుంటూ కూడా ఇదేం బుద్ధో! [ఒకడు]
అంటే వీళ్ళల్లో కాకలు తీరిన వీరత్వం కన్నా కాకాల కలవాటు పడ్డ బీరులెక్కువ మందన్నమాట. [ఇంకోడు]