tag:blogger.com,1999:blog-79464082024-03-22T09:28:24.574+05:30సాక్షి (Saakshi)A look at the world from my heart!Unknownnoreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-7946408.post-74369667475260818962011-08-02T22:15:00.000+05:302011-08-02T22:15:56.165+05:30పిట్ట కథ - ౧ఓ గురుకులంలో శిష్య పరమాణువు లందరూ విశ్రాంతి సమయంలో గుమిగూడి వాడి వేడిగా చర్చించుకుంటూ, తర్కించుకుంటూ, వాదించుకుంటూవున్నారు. ఆ వాదించుకునే విషయమేమిటంటే ప్రపంచంలోని ఈతి బాధలకు కారణమేమిటా అని.
కొందరు మనిషిలో స్వార్థం అన్నారు. ఇంకొందరు భ్రమ, భ్రాంతి అంటున్నారు.వేరొకరు మోహం, చపలత్వాల గురించి చెబుతున్నారు. మరికొందరు సత్తుకీ అసత్తుకీ తేడా తెలియకుండా పోవడమే అని వివరిస్తున్నారు.
వారిలో వారు గుంపులుగా Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-7946408.post-71663038483541052132011-07-23T03:01:00.000+05:302011-07-23T03:01:05.245+05:30మొబైల్ తో తంటాలు - ౧మనం కొంపలు మునిగిపోయినట్లుగా అర్జంటుగా ఆపకుండానే కారు తోలుతూనో లేదా బైక్ నడుపుతూనో మొబైల్ లో మాట్లాడుతుండటం సహజం. కానీ దీని వల్ల ఇతరులు ఏవిధంగా ఇబ్బంది పడతారో ఎప్పుడైనా ఆలోచించారా. పోనీ మీరెప్పుడైనా అటువంటి ఇబ్బందులకు గురైయ్యారా. నావరకు రెండూ అయ్యాయి.
మాట్లాడుతూ వాహనం నడిపితే ఎంత హాని కలుగుతుందో అని గవర్నమెంటు - ట్రాఫిక్ వాళ్లు ఎంత ప్రయత్నించినా ఎవరూ అర్థం చేసుకోవటంలేదట. చివరకి ఫైన్లు వడ్డించినాUnknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-7946408.post-55171093035685304722010-09-22T02:10:00.005+05:302011-07-22T03:34:12.415+05:30వేయి అద్దాల ఇల్లుఇదొక జపనీస్ జానపద గాథ.
చాలా కాలం క్రితం ఎక్కడో దూరంగా ఓ చిన్న గ్రామం వుంది. ఆ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే అక్కడ ఒక వేయి అద్దాల ఇల్లు ఒకటి వుంది. దాన్ని గురించి విన్న ఓ అందమైన ఆనందంగా వున్న చిన్న కుక్క పిల్ల ఓ సారి వెళ్ళి అందులో ఏముందో చూద్దామని అక్కడకి బయలు దేరింది. ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ గ్రామాన్ని చేరుకోగానే, చేరుకున్నానన్న ఆనందంతో గంతులు వేస్తూ వేయి అద్దాల ఇంటి వైపు సాగింది. ఇంటి గుమ్మం Unknownnoreply@blogger.com0Japan35.532226428606513 138.779296524.658072428606513 125.67381549999999 46.406380428606511 151.88477749999998tag:blogger.com,1999:blog-7946408.post-46533410797979557662010-08-15T15:42:00.001+05:302010-08-16T15:55:34.729+05:30నా/మా కింకా స్వతంత్ర్యం రాలేదు.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 63 సంవత్సరాలైందని పేపర్లో చూస్తే అనిపించింది ... అబ్బా అప్పుడే 63 సంవత్సరాల ముసలిదైపోయిందా భారద్దేశం అని.
వ్యక్తి పుట్టిన నాటినుండి సుమారు 25 - 30 సంవత్సరాలవరకూ శారీరకంగా ఎదుగుతూ వుంటాడు. 30 - 50 వరకూ ఎటువంటి ఎదుగుదలా కనిపించక పోయినా ఆతర్వాత మాత్రం తరుగుదల కనిపిస్తుంది. ఇదంతా మన కంటికి కనిపించేదే. కానీ మానసికంగా 16 - 18 సంవత్సరాల వరకూ శరవేగంగా అన్నిరంగాలలోనూ Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-7946408.post-62785504371673771002009-01-01T09:19:00.005+05:302009-01-01T09:27:06.929+05:30నూతన సంవత్సర శుభాకాంక్షలుఅందరూ అన్నివేళలా ఆనందంగా వుండాలని ఆశిస్తూ......నూతన సంవత్సర శుభాకాంక్షలు 2009Unknownnoreply@blogger.com2tag:blogger.com,1999:blog-7946408.post-85928303818459483012008-12-23T22:56:00.003+05:302008-12-23T23:05:30.031+05:30కాకలు తీరిన వీరులు - 2(ఆ)"అర్రెర్రే... ఇదేమిటిలా జరిగింది. ఎంతో ప్లాన్ చేసి పకడ్బందీగా అమలు చేసినా ఓడిపోయామేమిటి" అనుకుంటూ అమెరికన్లు కారణాలు వెతకటం మొదలెట్టారు. వీళ్ళేంచేసినా పద్ధతి ప్రకారం చేస్తారు కనుక, వెంటనే బడ్జెట్ కేటాయింది రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ కమిటీ ఒహటి వేసి దానికో బట్టతలని ఛైర్మన్ చేశారు. ఓ నెల్రోజులు అన్ని రకాలు గానూ స్టడీ చేసి వాళ్ళిలా చెప్పారు."ఇదంతా కో-ఆర్డినేషన్ ప్రాబ్లెం. తెడ్డేసే వాళ్ళు ఒకే రిథమ్ లో Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-7946408.post-12215984140656583032008-12-09T15:55:00.003+05:302008-12-09T16:10:11.126+05:30కాకలు తీరిన వీరులు - 2(అ)ఎప్పుడో మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నప్పుడు మేమందరం సరదాగా చెప్పుకునే జోకొకటి.మేనేజ్మెంట్ రంగంలో అనేక పరిశోధనలు, ప్రయోగాలు చేసి - అభివృద్ది ఎలా చెయ్యాలో, చెందుతుందో తెలుకున్నామంటున్న (కాకలు తీరిన వీరులు గా చెప్పుకొంటున్న) అప్రాచ్యులకీ (ప్రస్తుత సందర్భంలో అమెరికన్లకీ), నిశ్శబ్ధవిప్లవం ద్వారా అభివృద్ధిని సాధిస్తూన్న ప్రాచ్యులకీ (ప్రస్తుత సందర్భంలో జపానీయులకీ) ఓ సారి పోటీ వచ్చింది.మాకు ఏ రంగంలో Unknownnoreply@blogger.com5tag:blogger.com,1999:blog-7946408.post-5055442526104011472008-11-17T21:25:00.002+05:302008-11-17T21:42:29.452+05:30కాకలు తీరిన వీరులుఈ రోజు మధ్యాహ్నం భోంచేస్తూ అదీ ఇదీ మాట్లాడుతూంటే టాపిక్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కేసి మళ్ళింది...ఈ ఫైనాన్స్ సెక్టార్లో ఎంతోమంది కాకలు తీరిన వీరులున్నారుగదా... [ఒకడు]... ఎవరాళ్ళు? [ఇంకోడు]అంటే - ఏ పెద్ద కంపెనీనన్నా తీసుకో, దాన్ని నడిపే సన్నాసి ఐఐయ్యమ్మో, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండో వస్తాడు కదా! [ఒకడు]... ఓ ఆ తెలివైన వాళ్ళ గురించా నీవు మాట్లాడేది. అర్థమైంది కాకలు తీరిన వీరులంటే. ఇహ చెప్పు. [Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-7946408.post-39484294309938711732008-10-13T23:29:00.006+05:302008-10-13T23:45:34.060+05:30అత్యున్నత జీవనశైలి (ఐడియల్ లైఫ్ స్టైల్)ఓ పెద్ద ఊర్లో ఒక సమావేశం జరుగుతోంది. దానికి దేశదేశాలనుంచి ఓ వంద మంది గొప్ప గొప్ప వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులున్న పెద్దమనుష్యులు, అధ్యాపకులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, పండితులు, మతాధిపతులు, పీఠాధిపతులు, వేంచేసి యున్నారు. ఇంతకీ అక్కడ సమావేశంలో చర్చించే విషయం అత్యున్నత జీవనశైలి (ఐడియల్ లైఫ్ స్టైల్) గురించి.ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, వారి వారి జీవితానుభవాలనుంచీ, వారు చదివిన పుస్తకాలు, మత గ్రంధాలుUnknownnoreply@blogger.com6tag:blogger.com,1999:blog-7946408.post-55967660017502437012008-05-22T11:31:00.002+05:302008-05-22T11:42:43.916+05:30ఐతే ఏంటి?(పేపర్లో వార్త - కర్ణాటకలో కల్తీ సారా మృతులు 190)(స్ధలం - ఆఫీసులో మధ్యాహ్నం తిన్నాక)కల్తీ సారా తాగి చనిపోయినవారి సంఖ్య 150 దాటింది.ఎవరా నూటేభై?కూలీ నాలీ చేసుకునే లేబర్ క్లాస్.ఓ... లేబర్ క్లాసా!లేబర్ క్లాసైతే మాత్రం వాళ్లు మాత్రం మనుషులు కారా?మనుషులే, వాళ్లలోను రక్తం వుంటుంది (నవ్వు). కానీ వాళ్ళవల్ల దేశానికేం ఉపయోగం, భారం తప్ప.భారమా!!?కాక, మనది బీదదేశం ఎందుకైంది - ఇలా లేబర్ క్లాసు వాళ్ళెక్కువయ్యే Unknownnoreply@blogger.com2tag:blogger.com,1999:blog-7946408.post-50034552773310778372008-04-29T21:28:00.004+05:302008-04-29T21:46:29.615+05:30ఏన్యువల్ డే - ౩మేనేజరు ఒకాయన, వయసు 30-35 మధ్య వుండొచ్చు, అంతకు ముందే వీడియోలో మిగతా ఉద్యోగస్తులకి సందేశాలిచి, అవార్డులందుకున్నాడు. అతను పార్టీ ఉత్సాహంలో తాగి తన లగ్జరీ కారులో, సహోద్యోగులతో బయటకు వెళ్లబోయాడు. పార్కింగ్ ప్లేస్ నిండా వెహికల్స్ వున్నా మద్యం మత్తులో స్పీడుగా వచ్చాడు. ఆ రావటం అక్కడే నుంచుని వున్న ఓ క్యాబ్ డ్రైవర్ మీదుగా పోనిచ్చాడు.సాక్షుల కథనం ప్రకారం, ఆ క్యాబ్ డ్రైవర్ కాలు, చేయి పోయాయి. తప్పు తనదైనాUnknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-7946408.post-73960692678088874802008-04-18T22:36:00.016+05:302008-04-18T23:05:41.219+05:30ఏన్యువల్ డే - ౨క్రితం టపాకి సంబంధించిన కొన్ని ఫొటోలుపాశ్చాత్య నృత్య ప్రదర్శన (అ)అవార్డులూ - రివార్డులూ (ఆ)లేజర్ షో (ఇ)ఫ్యూజన్ డాన్స్ - ౧ (ఈ)ఫ్యూజన్ డాన్స్ - ౨ (ఉ)ఫ్యూజన్ డాన్స్ - ౩ (ఊ)ఫ్యూజన్ డాన్స్ పూర్తయ్యేలోపు చిత్రించిన చిత్తరువు (ఎ)అబ్బ ఏం జనమండీ (హ్హ హ్హ) - ౧ (ఏ)అబ్బ ఏం జనమండీ (హ్హ హ్హ) - ౨ (ఐ)ఇకపోతే క్రితం సారి చెబుతానన్న సంఘటన .. క్షమించండి .. వచ్చే టపాలో!Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-7946408.post-86439137460414455682008-04-17T03:00:00.001+05:302008-04-17T03:05:03.256+05:30ఏన్యువల్ డే - ౧ఓ ప్రముఖ కంపెనీ (పేరు గోప్యంగా వుంచడమైనది) ఆన్యువల్ డే (ఆంగ్లంలో ఏమంటారో?) సందర్భంగా పాలెస్ గ్రౌండ్సులో భారీ ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మా బామ్మర్ది అందులో పనిచేస్తుడడంతో నాకూ ఎక్స్టెండయ్యింది ఆహ్వానం. ఎప్పుడూ చూడలేదు కదా అని అంతా బయలుదేరాం. ఏర్పాట్లు మాత్రం నిజంగానే బ్రహ్మాండం. ఏంకర్లుగా ఓ ఇద్దర్ని బయటనుంచి పిలిపించారట - ఏమీ లాభంలేదు. కుళ్ళు జోకులేస్తూ (ఇంగ్లీషు మరియు కన్నడంలో) Unknownnoreply@blogger.com3tag:blogger.com,1999:blog-7946408.post-29473426639570000872008-04-09T00:08:00.003+05:302008-04-09T01:06:40.280+05:30అరిచే కుక్క మొరగదు - మూడునేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓ సంవత్సరం బందరు నక్కలతోటలో ఫ్రెండుతో (కోడూరి సాయిబాబు) కలిసి రూమ్ తీసుకుని వున్నాను. ఓ రోజు క్లాసులో చాలా మంది "రోజూ వినేదేగా క్లాసులు - బోరు కొడుతోంది సినిమాకెళ్దాం" అన్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి - మా కాలేజీలో 50 మందిదాకా వుండేవాళ్లం (తెలుగు, ఇంగ్లీషు మీడియంలు రెండూ కలిపి), కానీ అందరికీ కలిపి ఒకే క్లాసు - పంతుళ్లు తెలుగు, ఇంగ్లీషు కలగలిపి చెప్పేవారు. ఈ 50 Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-7946408.post-19335928972308180732008-04-07T00:58:00.003+05:302008-04-07T01:16:32.419+05:30ఉగాది (యుగాది) - మళ్లీ మొదలు!సుమారు ఆరు నెలలయ్యింది సాక్షిలో పోస్టు రాసి. కర్ణుడి చావుకి కారణాలనేకం, అలాగే నాకు బోలెడన్ని. మునుపెపుడో చెప్పా - బద్ధకం వాటిలో ముఖ్యమైనదని. ఇప్పటికీ అదే నిజమనుకోండి.మొన్నీ మధ్య బెబ్లాసం(బెంగళూరు బ్లాగర్ల సంఘం)కి వెళ్లినప్పుడు ప్రవీణ్ అడిగారు ఈ మధ్యేమీ రాయటంలేదని. రాయాలనివుంది కానీ కొత్త కొత్త పనుల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నాను. ఓ మంచి రోజు చూసుకు మళ్ళీ మొదలెడతానని. ఆ మంచిరోజు ఇదే నేమోఅందరికీ Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-7946408.post-45102092581323583462007-09-28T22:21:00.000+05:302007-09-28T22:33:50.717+05:30అరిచే కుక్క మొరగదు - రెండుకుక్క కరిస్తే బొడ్డుచుట్టూ పద్నాలుగింజక్షన్లు చేయించుకోవాలంటూ పెద్దలు వీధికుక్కలతో ఆటలాడుతుండే పిల్లలను హెచ్చరిస్తూండటం మా చిన్నప్పుడు పరిపాటి.ఇప్పుడెవరూ అనటంలేదనుకుంటా. ఎందుకంటే మూడిటితోనే సరిపోయే మోడర్న్ ఇంజక్షన్లు వచ్చేశాయిగా. అంతేకాకుండా కుక్కలకు కూడా అవి కరిచినా ఏమీకాకుండేందుకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్లూ వున్నాయిప్పుడు.క్రితం ఎపిసోడ్లో బొడ్డుచుట్టూ పద్నాలుగింజక్షన్లు చేసుకున్నవాడికి Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-7946408.post-48535773192344380622007-09-23T15:37:00.000+05:302007-10-11T23:11:03.148+05:30హంగరీ - అగ్నిప్రమాదంమీలో ఎవరైనా అగ్నిప్రమాదం పూర్తిగా చూసారో లేదో గానీ, నాకు మాత్రం ఇదే మొదటి సారి.బుడా పెస్టులో ఓ వీధిలోని అపార్టుమెంటులో నేనుంటున్నాను. 'ఓ వీధి' అంటే ఏదో ఒక వీధి కాదు - నేనుండే వీధిపేరే 'ఓ వీధి'. (Ó utca) ఓ ఉట్స - O street ఆంగ్లంలో. సాయంకాలం సుమారు ఏడున్నర ఎనిమిది మధ్యలో బాల్కనీలోకి వచ్చి సంజ వెలుగులో సిటీ అందాలు చూస్తున్నాను. మా వీధి మొదల్లో వుండే మరొక అపార్టుమెంట్లోంచి మెఱుపులాంటిదొచ్చింది. ఏమిటాUnknownnoreply@blogger.com2tag:blogger.com,1999:blog-7946408.post-52945184957061065182007-09-22T12:54:00.000+05:302007-10-11T23:11:03.148+05:30పిల్లలు - పార్టీలుగురువారం మధ్యాహ్నం హంగేరియన్ సహోద్యోగిని సెలవు తీసుకుంది - కారణం తెలీదు. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో అడిగింది - కంప్యూటర్లో ఫొటోషాప్‌తో ఫొటోలు ట్రిమ్ చేసి బోర్డర్ ఫ్రేమ్ జతచేయటం నేర్పమని. అంతకు ముందొకసారి నేను నా ఫొటోలు మాడిఫై చేస్తుంటే చూసి అడిగింది తనకు కూడా నేర్పమని. అప్పుడు సరేనని చెప్పడంతో ఇప్పుడడిగింది. అప్పుడే పెన్ డ్రైవ్ నుండి కాపీ చేసిన ఫొటోలను ఫొటోషాప్ లో తెరిచినప్పుడు చూసాను - Unknownnoreply@blogger.com6tag:blogger.com,1999:blog-7946408.post-87427037856586522572007-09-01T16:31:00.000+05:302007-09-01T16:45:14.286+05:30అరిచే కుక్క మొరగదు - ఒకటిమీలో కుక్కలంటే ఎందరికి భయం ? లేదా భయం లేనిదెంతమందికి?ఇప్పటిదాకా నా పరిశీలన ప్రకారం (నేనేం పనిగట్టుకునేం రీసెర్చ్ చెయ్యలేదు - జస్ట్ క్యాజువల్ అబ్జర్వేషన్) కుక్కలంటే భయం లేనివారు లేరు. ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు, ఎంతోకొంచెం ప్రతి ఒక్కరూ కుక్కలకి భయపడే వుంటారు.'కుక్కవున్నది జాగ్రత' అన్న బోర్డు చూసికూడా ధైర్యంగా తలుపు తట్టే దమ్మెవరికుందండీ <-రోడ్డు మీద నడుస్తుంటే అకస్మాత్తుగా వెనకనుండి ఓ Unknownnoreply@blogger.com2tag:blogger.com,1999:blog-7946408.post-22662302536690362792007-08-19T17:45:00.000+05:302007-08-20T15:12:45.543+05:30ఫ్లాష్ బాక్ - ఒకటి (మొదటికి మోసం)మొదటికి మోసంఅకస్మాత్తుగా పిడుగు (?) లాంటి వార్త హెఢాఫీసు నుండి వచ్చింది. పది రోజుల్లో క్లయింటు ప్లేసు కెళ్ళాల్సుంటుందనీ, పాస్‌పోర్టు పార్క్‌లేన్‌లో వున్న ట్రావెల్ ఏజెంటు కివ్వమనీ చెప్పారు. టెక్నికల్ కాన్ఫరెన్సుకాల్లో కూచున్నాక తెలిసింది - వెళ్ళాల్సింది నెదర్లాండు, హంగరీ, రొమేనియాల్లో ఒకదానికని. క్లయింట్లు అడిగిన ప్రశ్నల్నిబట్టి అర్థమైందేమిటంటే వాళ్ళేదో PHPలో ప్రాజెక్టు చేస్తున్నారు, దానికి అవసరమైనUnknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-7946408.post-61354558463202953032007-08-11T02:18:00.000+05:302007-08-11T02:28:07.341+05:30స్తబ్ధత{స్వగతం}ఇన్ని రోజులు స్తబ్ధుగా వుండటానికి కారణాలు చాలా వున్నాయి - కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్లుగా.ఊరు మారటం - బెంగళూరు నుండి హైదరాబాదుకు [1]నా మొదటి వుద్యోగం బెంగుళూరు లోనే. తర్వాత హైదరాబాదు షిఫ్టయ్యా. కొత్త వుద్యోగం బెంగళూరులో రావటంతో మళ్ళీ బెంగళూరు, ఆపై కొత్త బ్రాంచీ కోసం తిరిగి హైదరాబాదు. ఏక్‌నిరంజన్ గాళ్ళయితే ప్రాబ్లెం లేదుకానీ, పెళ్ళాం పిల్లలతో ఊరు మారడం అంత సులభమేం కాదు సుమీ!కొత్త Unknownnoreply@blogger.com4tag:blogger.com,1999:blog-7946408.post-23057720772491547162007-08-09T22:12:00.000+05:302007-08-09T22:17:44.475+05:30అనుభవంఆర్నెల్ల క్రితమే కొన్న ఓ భారీ షిప్పొకటి ఒక్క ట్రిప్పుకే మూల పడేసరికి సొంతదారులకి బండ పడినట్లయింది. షిప్పు తయారీదారులకి కబురు పెడితే వాళ్లు షిప్పును తమ దగ్గరికి తీసుకు వస్తేకానీ రిపేరు చేయలేమన్నారు. ఆగిన షిప్పును వాళ్ల దగ్గరికి చేర్చడానికయ్యే ఖర్చు ఎంతవుతుందాని లెక్కేసేసరికి కళ్ళు బైర్లుకమ్మి లోకల్ మెకానిక్కుల కోసం వెతికారు. ఓ పేరు మోసిన కంపెనీ నుండి ట్రక్కులో బోల్డన్ని టూల్స్ తీసుకుని నలుగురు Unknownnoreply@blogger.com3tag:blogger.com,1999:blog-7946408.post-38983154212863830622007-04-05T08:43:00.000+05:302007-04-05T08:43:02.301+05:30శోధన: మూడు వందల వీరులుశోధన: మూడు వందల వీరులుసుమారు రెండు వారాల క్రితం చూశానీ సినిమాని. చెక్కిన శిల్పాల్లాంటి 300 మంది స్పార్టన్ వీరులు లక్షలాది పర్షియన్ సైనికులతో చేసే యుద్ధం. గ్లాడియేటర్ తో పోల్చను గానీ, మందితో హడావుడి లేకుండా, గ్రాపిక్స్ అతిగా కనపడకుండా, మనం ప్రక్కనే వుండి చూస్తున్నాం అన్నట్లుగా తీశారు. నిజమే, మన భారతంలోనూ ఇంతకంటే పస కలిగిన కథావస్తువు లెన్నో!Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-7946408.post-69990553486032070922007-03-23T18:07:00.000+05:302007-03-23T18:11:59.339+05:30పాపం సుబ్బారావ్!ఇంటి దగ్గర పెళ్ళాంతో దెబ్బలాడి విసుగ్గా రోడ్డు మీదకొచ్చాడు సుబ్బారావు. సాయంకా కావస్తోంది. నడుస్తోంది రోడ్డుకు ఎడమ వైపే అయినా బుర్ర నిండా అలోచనలతో రోడ్డుమీద ధ్యాసైతే లేదు పాపం సుబ్బారావుకి. ఐదు నిముషాలు అలా నడిచాడో లేదో సడన్ గా పాత టీవీయస్సొకటి గుద్దటంతో క్రిందపడ్డాడు సుబ్బారావుని. అసలే పెళ్ళాం మీది కాకతో వున్నాడేమో కోపంగా చూశాడు గుద్దిన వ్యక్తి వంక. గుద్దిందెవరో కాదు, పదో తరగతి చదువుతున్న Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-7946408.post-11680475706645566902007-03-19T23:04:00.000+05:302007-03-19T23:44:26.034+05:30శాలివాహన శకం... ఉగాది ఆవిర్భావంబ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజును గుర్తుచేసుకుంటూ జరుపుకొనే పండుగ ఉగాది పండుగ. యుగాదిని నిరంతరం గుర్తుంచుకోవాలన్న విషయం దీని వెనుక ఉంది. ఈ విషయాన్ని బ్రహ్మాండ పురాణం లాంటి పురాణాలు చెబుతున్నాయి. సృష్టిని ప్రారంభించిన తరువాత దాన్ని పరిపాలించమని బ్రహ్మదేవుడు కొంతమంది దేవతలకు బాధ్యతలను అప్పగించాడు. వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలను పాలించడానికి ముందుకు వచ్చిన శుభసందర్భాన్ని పండుగగా Unknownnoreply@blogger.com1